రియల్ ఎస్టేట్ పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ముఠాను భువనగిరి పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. లాభాలు చూపిస్తామని భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. పట్టుబడ్డ నిందితుల నుంచి ఒక ఇళ్లు, నాలుగు ప్లాట్లకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకొని, అర కిలో బంగారం, కారు, 10 ఫోన్లను సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడ్డ సొత్తు విలువ సూమారు రూ.5 కోట్లు ఉంటుదన్నారు