భువనగిరి: ఎస్సీ నిరుద్యోగ యువతకు నైపుణ్య అభివృద్ధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. వసతితో పూర్తి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు ఉండాలి. ఈనెల 25 లోపు దరఖాస్తులను జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.