ఆడవాళ్లకి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పనులు ఉంటాయి. దానితో పాటు ఉద్యోగం చేసే వాళ్ళు అయితే ఇంటి పని ఆఫీసు పని రెండు కూడా చేసుకుంటూ ఉండాలి. అందుకని ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం కూడా చాలా ముఖ్యం. మహిళలు ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోవాలి. అయితే మరి ఆ సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఆహార పదార్థాలను కనుక మహిళలు తీసుకుంటే కచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది ఆని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పాలకూర:
పాలకూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం మొదలు అన్ని పోషక పదార్ధాలు దీని ద్వారా మనం పొందవచ్చు.రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పెంచుతుంది.
పప్పులు:
మనకు దొరికే ఏ పప్పు అయినా మనం తీసుకోవచ్చు. ఆరోగ్యానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. కందిపప్పు మొదలు మినప్పప్పు వరకు ప్రతిదీ కూడా ఎంతో ఆరోగ్యం. కనుక వీటిని కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది.
ఓట్స్:
ఓట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అలానే ఓట్స్ లో ఫ్యాట్ మినరల్స్, ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది.
పాలు:
పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాలల్లో క్యాల్షియం, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటుంది. ప్రతి రోజూ తప్పకుండా ఒక గ్లాసు పాలు తాగండి.
బీట్ రూట్:
బీట్ రూట్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే హైబీపీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. బీట్రూట్ ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.
బాదం:
బాదం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే ప్రతిరోజూ బాదం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. కనుక ఈ ఆహార పదార్థాలను తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.