ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు.. కేంద్ర బడ్జెట్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

-

నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది మాట్లాడుతూ తెలంగాణకు బడ్జెట్ లో ఏం ఇచ్చారని అడుగుతున్నారని.. ఇది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాదు.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అని అన్నారు.

కేంద్రం అమలు చేసే అన్ని పథకాల్లోనూ తెలంగాణ భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు తీసుకువచ్చినా దాని లబ్ధి తెలంగాణ ప్రజలకు చేకూరుతుందన్నారు కిషన్ రెడ్డి. ఇది మధ్య తరగతి ప్రజల డ్రీమ్ బడ్జెట్ అని పేర్కొన్నారు. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చి మోదీ సర్కార్ ఎంతో గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నప్పటికీ.. ప్రజల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఇక వచ్చే ఐదేళ్లలో ఎమ్మెస్ఎంఈ లకు బడ్జెట్ లో రూ. 1.50 లక్షల కోట్లు కేటాయించామన్నారు. ఇందులో తెలంగాణకు కూడా లబ్ధి చేకూరితుందని తెలిపారు. తెలంగాణలో పది లక్షలకు పైగా ఎన్ఎస్ఎంఈ లు ఉన్నారని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 27 రంగాలలో స్టార్టప్ కంపెనీలు ఉన్నాయని.. వీటి కోసం పది వేల కోట్లతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. దీని ద్వారా తెలంగాణలో ఉన్న స్టార్టప్ కంపెనీలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అలాగే 50 ఏళ్ల వరకు వడ్డీ రహిత రుణాలతో తెలంగాణకు కూడా ఎంతో లబ్ధి కలుగుతుందన్నారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news