నల్గొండ పార్లమెంటు పరిధిలో ఈ నెల 21 నుంచి నిర్వహించబోయే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి హాజరుకానున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. 21న సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, 22న మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్గొండలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.