శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి భారీ మొత్తంలో బంగారాన్ని పట్టుకున్నారు. 975 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.50 లక్షలు ఉంటుందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.