5 కిలోల చిన్న సిలిండర్లను రేషన్ షాపుల ద్వారా త్వరలో విక్రయించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయిల్ కంపెనీలు, రేషన్ షాప్ డీలర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ సామాన్యులు సిలిండర్ కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నందున 5 కిలోల చిన్న సిలిండర్ కొనుగోలు సులభంగా ఉంటుందని ఆయన వివరించారు.