శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు 30, 30(ఎ) పోలీసుచట్టం (1861) అమలులో వుంటుందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్ తెలిపారు. సంగారెడ్డి, జిల్లాల పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. రాస్తారోకోలు, సభలు, సమావేశాలు, నిరాహార దీక్షలు నిర్వహించకూడదని, ప్రజా ధనానికి నష్టం కలిగించే కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు.