పెద్దమ్మ గుడి వద్ద బస్సు బైకు ఢీ.. ఒకరు స్పాట్ డెడ్

accident

గంభీరావుపేట్ మండలం పెద్దమ్మ గుడి వద్ద ఆర్టీసీ బస్సు.. బైకును ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మాచారెడ్డికి చెందిన రాము అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా కామారెడ్డి వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. గంభీరావుపేట మండలం రాజుపేటలో రాము ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.