శ్రీనివాస్ నగర్ గ్రామ మత్స్యకారులకు ఈ రోజు వింత చేప వలలో చిక్కింది. మత్స్యకారులు ఎరవేణి చంద్రమౌళి, రంగనవేణి సంతోష్ తెలిపిన వివరాలు.. గత 20 ఏళ్లు చేపలు పడుతూ జీవిస్తున్నామన్నారు. చేప కింది భాగాన పులి చర్మంపై చారుకలు ఉన్నట్టుగా భయంకరంగా ఉందని, అన్నిచేపలకు నోరు ముందు భాగంలో ఉంటే, ఈ చేపకు మాత్రం నోరు కిందిభాగంలో ఉండడం వింతగా ఉందన్నారు. ఇలాంటి చేపను చూడటం 20 సంవత్సరాలలో ఇదే మొదటిసారి అని తెలిపారు.