జగిత్యాల జిల్లాలో పండగ పూట విషాదం

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కొసునూర్ పల్లెకు చెందిన తట్ల మల్లయ్య(65) అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. గ్రామంలోని కల్లేపు మాధవ రెడ్డి ఇంట్లో పాలేరుగా పని చేసే మల్లయ్య ఈ నెల 12న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. 2 రోజుల నుంచి కుటుంబ సభ్యులు వెతుకుతుండగా.. శుక్రవారం గ్రామ శివారు వ్యవసాయ బావిలో శవమై తేలాడు.