కరీంనగర్ : ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

-

పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలనీకి చెందిన కనక అశోక్ (30) అనే యువకుడు కడుపు నొప్పితో కొంత కాలంగా బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడిన తగ్గకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఉదయం ఇంట్లో దూలనికి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతితో కాలనిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news