కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ అందించనున్నట్లు కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. బూస్టర్ డోస్ వారికి, 15 నుంచి 18 సంవత్సరాల వారికి వేర్వేరుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి టీకాలు అందించాలని ఆయన ఆదేశాలిచ్చారు. మాస్కు లేకుండా తిరిగితే రూ.1000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.