ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న వేళ రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఓ వైపు వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే.. మరో వైపు నిర్ధారణ పరీక్షలను పెంచుతున్నది. ఇంకోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. నేటి నుంచి బూస్టర్ డోస్ (ప్రికాషనరీ డోస్) ఇవ్వనుండగా, జిల్లా యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగింది. అన్ని పీహెచ్ సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ ప్రధాన దవాఖానల్లో ఏర్పాటు చేసింది.