తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా దుబ్బాక పట్టణానికి చెందిన చాడా విజయ్ భాస్కర్ రెడ్డి బుధవారం నియమితులయ్యారు. దుబ్బాక పట్టణానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా నియమించడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు న్యాయం చేసే విధంగా తాను పనిచేస్తానని అన్నారు.