కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రాణాంతకమైనది కాదని మెదక్ జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర రావు తెలిపారు. ఒమిక్రాన్ వచ్చిన వారికి గొంతులో నొప్పిగా ఉంటుందని, లంగ్స్పై అంతగా ప్రభావం ఉండదని అన్నారు. ఒమిక్రాన్‌కు జిల్లాలో వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు. వైద్య సిబ్బందికి పండుగ సెలవులు రద్దుచేసి విధుల్లో ఉండాలని ఆదేశించామన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి ఆస్పత్రి, హోమ్ ఐసోలేషన్ చికిత్స అందించనున్నారన్నారు.