అబద్దాలకు.. అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్.. అత్యంత వెనకబడిన వారు ఉన్న చోట ఉన్న ప్రాజెక్టు. ఆప్రాజెక్ట్ ను జగన్ పూర్తి చేయకపోగా పూర్తి చేసినట్టు అబద్ధాలు చెబుతున్నారు. 1996 లో భూమి పూజ చేసిన వెలిగొండ ప్రోజెక్టు ఇంకా పూర్తి కాకపోవడం సీఎం చంద్రబాబు అసంతృప్తి తో ఉన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ 2014 లో 38 శాతం పూర్తి అయ్యింది.
జగన్ 2019 లో అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సింది. కానీ జగన్ పాపాలు వెలిగొండ పాపాలుగా మారాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ పూర్తి చేస్తా అని దఫాదఫాలుగా చెప్పుకుంటూ వచ్చారు. వెలిగొండ ప్రశ్నర్ధకం అయిన పరిస్థితిలో జగన్ జాతికి అంకితం చేశారు. అధికారంలో ఉన్నపుడు పరదాలు కట్టుకుని హెలికాప్టర్ పర్యటనలు చేసిన జగన్ ఇప్పుడు అధికారం కొల్పోయాక మేం వేసిన రోడ్ల పై ప్రయాణిస్తున్నారు. రూ.4 వేల కొట్లు ఖర్చు పెట్టి నిరంతరం రెండేళ్లు పని చేస్తేనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుంది అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.