ఈ పథకాలతో రైతులకి ఎన్నో లాభాలు.. అర్హత, అప్లై చేసుకునే విధానంతో పూర్తి వివరాలను తెలుసుకోండి..!

-

కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉండే ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. అయితే విద్యార్థులకు, వ్యాపారస్తులకు, మహిళలతో పాటుగా రైతుల కోసం కూడా కొన్ని పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి పథకాలతో రైతులు ఎన్నో లాభాలను పొందుతున్నారు. ఈ విధంగా పథకాలను అందించడం వలన వ్యవసాయ రంగం కూడా ముందుకు వెళుతుంది మరియు రైతులకు ఆర్థిక సహాయం కూడా అందుతుంది. వాటిలో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ పధకంలో ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా పంటల నష్టపరిహారం కోసం పీఎం ఫసల్ బీమా యోజనను అందిస్తున్నారు. వీటితో పాటుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ స్కీమ్, సీడ్ విలేజ్ స్కీమ్, ప్రధాన మంత్రి క్రిషి సంచాయ్ యోజన, పీఎం కుసుమ్ స్కీమ్, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్,
అగ్రికల్చర్ ఇన్‌ప్రా ఫండ్ స్కీమ్ వంటి మొదలైన మరెన్నో పథకాలు రైతులకు అందిస్తున్నారు.

పీఎం ఫసల్ బీమా యోజన:

ఈ పథకం ద్వారా రైతులకు నష్టం వచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. ముఖ్యంగా రైతులు ఎన్నో విపత్తులను ఎదుర్కొంటారు లేక పంటలో తెగుళ్లు లేక కరువు వంటివి రావడం జరుగుతుంది. అటువంటి సమయంలో రైతుల పంటలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు పీఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన:

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతుల పెట్టుబడి కోసం ప్రతి సంవత్సరం 6000 రూపాయలను కేంద్రం అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా 11 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయాన్ని అందించడం జరిగింది.

కిసాన్ క్రెడిట్ కార్డ్:

చాలా శాతం మందికి పెట్టుబడి ఉన్నా సరే ఎన్నో ఖర్చులు ఉండడం వలన అవసరం అయిన సమయంలో సహాయం అందదు. అందువలన రైతులకు ఎటువంటి హామీ లేకుండా రుణాలను అందించడానికి 1998 లోనే కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకువచ్చింది. అయితే ఈ పథకం ద్వారా కేవలం రుణాన్ని అందించడం మాత్రమే కాకుండా రైతుల వడ్డీ లో నాలుగు శాతం రాయితీని కూడా అందిస్తుంది. ఇటువంటి పధకాల వలన రైతుల పెట్టుబడికి మరియు రుణాలను తిరిగి చెల్లించడానికి ఎంతో సహాయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version