ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో మీట్ గ్రీట్ కార్యక్రమంకు హాజరైన కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు అడిగే ధైర్యం లేకనే తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదు. జాబ్ క్యాలెండర్ ను అధికార కాంగ్రెస్ గాలికి వదిలేసింది. ప్రజలను, నిరుద్యోగులను, ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.
రాష్ట్రంలో ఒక్కొక్క నిరుద్యోగికి 56 వేల రూపాయలు ప్రభుత్వం బకాయి పడింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రజలకు ప్రయోజనం లేకుండా పోయింది. ప్రజాస్వామ్యంలో రౌడీయిజానికి, స్థానం లేదు. వాటిని కఠినంగా పని చేయాలి. రామలింగ మూర్తి హత్యపై సమగ్ర విచారణ జరగాలి. రాజకీయాలకు తావు లేకుండా.. జరిగిన రామలింగమూర్తి హత్యపై సమగ్ర విచారణ జరపాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.