ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని నాపై చాలా సార్లు జోకులు వేస్తుంటారు. ఈరోజు నా వస్త్రధారణ చూసిన తర్వాత అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళుతున్నావా అని ప్రధాని అన్నారు.. అలాంటిదేమీ లేదని నేను చెప్పాను.. చేయాల్సింది చాలా ఉంది అని పీఎంకు చెప్పాను అని పవన్ పేర్కొన్నారు.
ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళుతున్నాం. అయితే వెన్ను నొప్పి కారణంగానే ఏపిలో కొన్ని సమావేశాలకి హాజరు కాలేకపోయాను. ఇప్పటికి వెన్న నొప్పి తీవ్రంగా బాధిస్తుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోంది. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారు..ఆ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇచ్చిన హామీల అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. పర్యావరణ అటవీ శాఖలు నాకు చాలా ఇష్టమైన శాఖలు. నిబద్ధతతో నా మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న అని పవన్ కళ్యాణ్ తెలిపారు.