
మెదక్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించుటకు ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి విజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ అర్హత గల యువతీ యువకులు ఈ నెల 9న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2:00 వరకు మెదక్ పట్టణంలోని ప్రైవేట్ ఐటీఐ పక్కనగల జిల్లా ఉపాధి కార్యాలయంలో హాజరు కావాలన్నారు.