ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ

-

ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై ప్రధానితో చర్చించారు చంద్రబాబు. రాష్ట్ర పరిస్థితులు, ఏపీ అభివృద్ధికి సహకారం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్ లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపై చర్చించారు.

అలాగే గత బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్ లో ప్రతిపాదించిన 15 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని వేగవంతం చేయాలని ప్రధానిని కోరారు చంద్రబాబు. అలాగే వైజాక్ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. ఇక చివరగా పోలవరం నిర్మాణానికి సహకారం, వరద సెస్ కి అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరారట. వీటికి ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news