సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో దళితబంధు, మన ఊరు మన బడి అంశాలపై మంత్రి హరీష్ రావు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ఏడాది ఉమ్మడి మెదక్ జిల్లాలో దళితబంధు అర్హత పొందిన 1156 మంది లబ్ధిదారులకు రూ.115 కోట్ల నిధులు వినియోగించనున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ మంజుశ్రీ, ఎంపీ కొత్త ప్రభాకర్ తదితరులున్నారు.