జిల్లాలో పూర్తికాని వైకుంఠదామాలు

జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా వివిధ మండలాల్లో మొత్తం రూ.42.33 కోట్ల అంచనాతో 336 వైకుంఠధామాలు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 230 వరకు పూర్తికాగా మరో వందకు పైగా వివిధ దశల్లో ఉన్నాయి. పనులు అసంపూర్తిగా ఉండటంతో అంతిమయాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదని అంటున్నారు.