ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లు దాటిన కరోనా కేసులు

-

చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి… థర్డ్ వేవ్ రూపంలో ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఇక ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే.. 31 లక్షల పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. అటు ఏడు వేల 600 మందికి పైగా వైరస్ బారినపడి మృతి చెందారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరుణ కేసుల సంఖ్య 32 కోట్ల 6 లక్షల 87 వేల 118కి చేరింది.

ఇక మొత్తం మరణాల సంఖ్య 55 లక్షల 38 వేల 809 కి చేరింది. 24 కోట్ల 40 లక్షల 17వేల 707 మంది వైరస్ ను జయించారు. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల 30 వేల ఆరు వందల రెండు కేసులు ఆక్టివ్ గా ఉన్నాయి. ఇక మన ఇండియా విషయానికి వస్తే… గడిచిన 24 గంటల్లో దేశంలో 2,64,202 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,018,358 కు చేరింది. అంటే నిన్నటి కంటే కరోనా పాజిటివిటీ రేటు 6.7% ఎక్కువగా నమోదు అయింది. అలాగే రోజు వారి కరోనా పాజిటివిటీ రేటు 14.78% గా నమోదు అయింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 12,72,073 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news