మెదక్ : నేటి నుంచి కొండపోచమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం

జగదేవపూర్‌ మండలం తిగుల్‌ నర్సాపూర్‌ శివారులో వెలసిన కొండపోచమ్మ ఆలయం ఉత్సవాలకు ముస్తాబైంది. కొండపోచమ్మ నామంతో ప్రసిద్ధి పొందిన జగన్మాత శీలాదేవి వేలాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్నారు. కొమురవెల్లి మల్లన్న దర్శనం అనంతరం భక్తులు కొండపోచమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ. సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు నెలల పాటు ఇక్కడ జాతర కొనసాగుతుంది. వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు.