సంగారెడ్డి జిల్లాలో రాజస్థాన్ కార్మికుడు ఆత్మహత్య

crime

జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామికవాడలో మంగళవారం ఓ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శాలిని స్టీల్ పరిశ్రమలోని ఓనివాస గృహంలో షోనుజోషి (28) కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం రాజస్థాన్. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.