మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కండ్లకోయలో నివాసం ఉండే అల్లి బాలకృష్ణ(31) ఓ ప్రైవేటు కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈనెల 11న డ్యూటీకి వెళ్తున్నానని ఇంటి నుండి వెళ్లిన బాలకృష్ణ తిరిగి ఇంటికి చేరుకోలేదు. చుట్టు పక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం అతని భార్య రేణుక మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.