
మంత్రి సబితా ఇంద్రారెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శుక్రవారం కలిశారు. జిల్లా కేంద్రంలోని ఎస్కెఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో రన్నింగ్ ట్రాక్ నిర్మాణానికి, ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఆడిటోరియం నిర్మాణానికి, హాస్టల్ వసతుల మెరుగుకు, ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.