మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల దయతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.