‘వచ్చేవన్నీ ఒమిక్రాన్‌ కేసులే’

ప్రస్తుతం వచ్చేవన్నీ ఒమిక్రాన్‌ కేసులేనని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి కోటాచలం అన్నారు. ప్రస్తుతం వస్తున్న కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్‌‌, డెల్టా కేసులే అన్నారు. ఒమిక్రాన్‌‌ పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు 96శాతం మొదటి డోసు వాక్యినేషన్‌ పూర్తయిందని, ఈ నెల 26 వరకు 100 శాతం పూర్తి చేస్తామన్నారు.