నల్లగొండ: ఎంపీని కలిసిన నియోజకవర్గ నేతలు

కనగల్, తిప్పర్తి, నల్లగొండ కాంగ్రెస్ నాయకులు గురువారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నర్సింగ్ శ్రీనివాస్, ఇబ్రాహీం, వెంకటేశ్వర్లు, ఆదిమూలం ప్రశాంత్ పాల్గొన్నారు.