ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెరుగుతున్న కరోనా

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 104 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య అధికారులు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో 29 కరోనా కేసులు నమోదు కాగా, సూర్యాపేట జిల్లాలో 38 కరోనా కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 37 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, కచ్చితంగా మాస్క్, భౌతిక దూరం పాటించాలని వైద్యులు తెలిపారు.