ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడిన సిబ్బంది పై సస్పెన్షన్ తో పాటు క్రిమినల్ కేసు నమోదు చేశామని కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి గురువారం సూర్యాపేట పట్టణంలో తెలియజేశారు. జిల్లాలో ఈ సీజన్ వానాకాలం వరి ధాన్యం సేకరణ జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగిందని సీజన్ పూర్తి అయిన వెంటనే 285 సెంటర్లకు సంబంధించిన రికార్డులు, ట్రక్కు చీట్స్ కలెక్టరేట్ కు తెప్పించి పరిశీలన చేపట్టడం జరిగిందని అన్నారు.