తుంగతుర్తి మండల కేంద్రంలోని 132/33కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో బుధవారం సాయంత్రం సాంకేతిక కారణాలతో భారీ శబ్ధంతో ట్రాన్స్ఫార్మర్ పేలింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వడ్డె కొత్తపల్లి నుండి ట్రాన్స్ఫార్మర్ను తుంగతుర్తి 133/33 కేవి సబ్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అనంతరం విద్యుత్ సరఫరా అవుతున్న క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో మంటలు చెలరేగినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.