సూర్యాపేట: కారును తప్పించబోయి లారీ బోల్తా

-

సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలో 7స్టార్ హోటల్ వద్ద హైదరాబాద్ – విజయవాడ రహదారిపై శుక్రవారం సిమెంట్ లారీ బోల్తా పడింది.

కోదాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీ 16టిఈ 6511 నెంబరు గల సిమెంట్ లారీ ఉదయం హైదరాబాద్ వైపు వెళుతున్న కారును తప్పించబోయి రోడ్డుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు. సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news