కోదాడ ప్రాంతంలో సీడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు అంగీకారం

-

కోదాడ ప్రాంతంలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు జాతీయ విద్యా బోధన పరిశోధన కేంద్రానికి లేఖ రాసినట్లు కోదాడకు చెందిన ప్రవాస భారతీయులు జగన్ సుదీర్ తెలిపారు. తాను రాసిన లేఖ కు స్పందించి జాతీయ విత్తన పరిశోధనా మండలి కోదాడ ప్రాంతాన్ని పరిశీలించి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సుధీర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రం రాకతో రైతులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news