మహాశివరాత్రి పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలోని రుద్రేశ్వరాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి-సునీత దంపతులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగానికి అభిషేకాలు చేశారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు