వర్షాలు పడితే మూసీ నదికి వరదలు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అందుకోసమే ప్రతి వర్షపు చుక్క మూసీలోకి వెళ్లేలా నాలాల అభివృద్ధి చేపట్టామన్నారు. దీనికోసం రూ.900 కోట్లకు పైగా కేటాయించామని తెలిపారు. రూ.3,866 కోట్లతో ఎస్టీపీలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్లో లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందజేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.