అప్పుడు నన్ను సెకండ్ హ్యాండ్ అన్నారు : సమంత

-

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం ఫుల్లు బిజీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్ లోనూ సామ్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. ఒక్క సినిమాలే కాకుండా వెబ్ సిరీసుల్లో సైతం సామ్ మెరుస్తున్నారు. రీసెంట్‌గా హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ హిందీ డబ్బింగ్ ‘హనీ బన్నీ’లో నటుడు వరుణ్ ధావన్‌కు జంటగా సమంత లీడ్ రోల్ ప్లే చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సామ్ సంచలన కామెంట్స్ చేసింది. ‘తను విడాకులు తీసుకున్న టైంలో కొందరు తనను సెకండ్ హ్యాండ్ అని, యూస్‌డ్ అని కామెంట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే ఫెయిల్యూర్‌గా పరిణగిస్తారు. ఇలాంటి పరిస్థితులు చేసుకోవడం మహిళలు, వారి కుటుంబాలకు చాలా కష్టంగా ఉంటుంది. నాపై చాలా రూమర్స్ వచ్చాయి. అవి నిజం కాదని చాలా సార్లు చెప్పాలనిపించింది. కానీ, చెప్పడం వలన ప్రయోజనం లేదని ఆగిపోయా’ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version