ఆ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటాం.. హరీశ్ రావుకు బీఆర్ నాయుడు హామీ

-

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలంగాణకు చెందిన కీలక నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇటీవల సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్‌లను కలిసిన ఆయన.. తాజాగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో భేటీ అయ్యారు. నగరంలోని హరీష్ నివాసంలో వీరిద్దరు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగాబీఆర్ నాయుడిని శాలువాతో సత్కరించి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా విశేష సేవలు అందించిన ఆయనకు తిరుమల శ్రీవారికి సేవ చేసే భాగ్యం రావడం అదృష్టమని హరీష్ రావు అన్నారు. తిరుమల ఆలయ అభివృద్ధికి బీఆర్ నాయుడు మరింత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల స్వామి దర్శనం కోసం వస్తున్నందున..తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన్ను హరీష్ రావు కోరారు. తెలంగాణ భక్తులకు దర్శనం, వసతి వంటి సేవలను మెరుగుపరచడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయన్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి, టీటీడీ బోర్డులో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ హరీశ్ రావుకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా, సిద్దిపేట, కరీంనగర్‌లో టీటీడీ ఆలయాల పనులను త్వరగా పూర్తిచేయాలని హరీశ్ రావు కోరారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version