గ్రే డివోర్స్.. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పదం. గ్రే డివోర్స్ అంటే.. జుట్టు నెరుస్తున్న సమయంలో విడాకులు తీసుకోవడం అన్నమాట. అంటే.. భార్యాభర్తలుగా 25 నుండి 30 ఏళ్ల పాటు జీవించి ఆ తర్వాత విడాకులు తీసుకోవడం అన్నమాట.
వయసు మీద పడ్డాక ముసలితనానికి దగ్గరవుతున్న సమయంలో విడాకులు తీసుకోవటాన్ని గ్రే డివోర్స్ అంటారు. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండు బాగా పెరుగుతుంది.
తాజా గా ఏఆర్ రెహమాన్ దంపతుల ఉదంతమే దీనికి ఉదాహరణ.
ఈ ట్రెండు పెరగడానికి కారణాలు:
భార్యాభర్తలిద్దరికీ 50 ఏళ్లు వచ్చేసరికి పిల్లలు పెద్దవాళ్ళయిపోయి.. చదువుకోసమనో, ఉద్యోగం కోసమనో ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఇంట్లో ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీని భార్యాభర్తలిద్దరూ పూడ్చాలి. కానీ అలా కాకుండా ఎవరికి వారన్నట్టుగా తమ తమ పనుల్లో నిమగ్నమైపోవటం వల్ల.. కలిసి ఉండడం ఎందుకన్న భావన వస్తుంది
గ్రే డివోర్స్ వైపు వెళ్లడానికి డబ్బు కూడా మరో కారణంగా ఉంటుంది. ఈ డబ్బు నీది, ఈ రూపాయి నాది.. అంటూ లెక్కలు వేసుకుంటే తగాదాలు మొదలవుతాయి. భార్యాభర్తలిద్దరూ జాబ్ చేసి రిటైర్ అయితే.. ఆ డబ్బును ఎలా పంచుకోవాలనే విషయంలో గొడవలు వచ్చి డివోర్స్ దాకా వెళ్తున్నాయని నిపుణులు అంటున్నారు.
అనారోగ్య సమస్యలు:
భార్యాభర్తల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే.. మరొకరు డివోర్స్ తీసుకోవడానికి రెడీ అయిపోతుండడం కూడా గ్రే డివోర్స్ ట్రెండును పెంచుతోంది. ఒకరికి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మరొకరు ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవ్వడం వల్ల పరిస్థితి విడాకులు దాకా వెళ్తోంది.