రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న తరుణంలో జడ్పీ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశానికి ప్రజాప్రతినిధులు అందరూ డుమ్మా కొట్టారు. శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిషత్తు సమావేశానికి ఒకే ఒక్కరూ.. కందుకూరు జడ్పీటీసీ సభ్యుడు హాజరయ్యారు. కాగా మిగిలిన జడ్పీటీసీలు సమావేశానికి వెళ్లొద్దని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతుంది.