వర్షాలతో చెరువులా మారిన పార్కింగ్ ప్రదేశాన్ని పూర్వస్థితిలోకి తెచ్చేందుకు అధికారులు తంటాలుపడుతున్నారు. జాతర కోసం వచ్చేవాహనాలు నిలిపేందుకు కలెక్టర్ చొరవతో ఊరట్టంలో మోడల్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు, తాగునీటి నల్లాలు, వాహనాలు వచ్చేందుకు వెళ్లేందుకు వీలుగా దారులు ఏర్పాటు చేశారు. అనూహ్యంగా కురిసిన వర్షంతో పార్కింగ్ ప్రదేశం కాస్త చెరువులా మారింది.