కాంగ్రెస్ చేతకానితనంతో.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది : కేటీఆర్

-

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండే అనే నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావొచ్చునా? ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రభుత్వ ఉద్యోగులకు 73 శాతం జీతం పెంచినందుకు బాగాలేకుండేనా? లేకపోతే భారత దేశంలోనే హైయెస్ట్ పేస్కేల్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చినందుకు బాగాలేకుండేనా? అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగాలేకుండేనా? అని ప్రశ్నించారు.

ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టినందుకు బాగా లేకుండేనా ? రాష్ట్రాన్ని భారత దేశంలోనే తలసరి ఆదాయంలో నిలబెట్టింది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రేవంత్ రెడ్డి నాశనం చేశాడు. చక్కగా పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని.. హైడ్రా పేరిట, మూసీ పేరిట నాశనం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. కాంగ్రెస్ చేతకానితనంతో.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news