బీజేపీ, బీఆర్ఎస్ కి భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్..!

-

ఎన్నికల ముందు రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.12వేలు ఇస్తామని ప్రకటించడం పై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వారికి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ మాదిరిగా మేము పీఎం కిసాన్ కు విధించినట్టుగా రకరకాల కండీషన్లు తాము పెట్టలేదన్నారు. సాగు చేసే భూములకు ఎలాంటి షరతు లేకుండా ఇవ్వబోతున్నామన్నారు. బీజేపీ వాళ్లు ఎంత తక్కువ మాట్లాడితే వాల్లకు అంత మంచిది అన్నారు.

మరోవైపు రాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్ల అప్పుల్లో కేసీఆర్ ముంచిపోయారని అయినా అలాంటి పరిస్తితిని సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. మిగులు రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే భూమి లేని రైతుల గురించి ఏనాడు ఆలోచించని బీఆర్ఎస్ కు బుద్ది ఉందా..? అని ఘాటు విమర్శలు చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకు రూ.12వేలు ఆర్థిక సహాయం చేయబోతున్నట్టు తెలిపారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా కేటీఆర్ రైతు భరోసా ఇవ్వాలంటున్నారు. ఎట్టి పరిస్థితిలో రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వమని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news