
ఐరన్ పైప్‌లు మీద పడి లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన చౌటుప్పల్ మండలం మల్కాపురంలో చోటు చేసుకుంది. దండు మల్కాపురం శివారులో ఐవోసీల పైప్ లైన్ ఫ్యాక్టరీలో బీహార్‌కు చెందిన అజయ్ కుమార్ సింగ్(51) బీహార్ నుండి పైప్‌లను ఫ్యాక్టరీకి తెచ్చాడు. లారీలో నుంచి దింపే క్రమంలో ఐరన్ పైప్‌లు మీద పడడంతో అతడు అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.