బేగంపేటలో వ్యక్తిపై కత్తితో దాడి

బేగంపేట పీఎస్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. ఇలాహి మజీద్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ప్రదీప్ అనే వ్యక్తిపై మునీర్‌తోపాటు అతని స్నేహితులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ప్రదీప్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా చిలకలగూడలో డబ్బుల విషయమై నవాజ్, సంతోష్‌ అనే వ్యక్తుల మధ్య జరిగిన వివాదంలో సంతోష్‌ను నవాజ్ కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.