బాలకృష్ణ భార్య ఎవరో తెలుసా… ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

  1. బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి తారకరామారావు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఎంతో కష్టపడి తనకుతానుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఎదిగాడు… ఇది ఇలా ఉంటే బాలకృష్ణ వివాహం విషయానికి వస్తే… ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు బాల‌య్య‌కు పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర‌రావుకు సంబంధం చూడ‌మ‌ని చెప్ప‌డంతో నాదెండ్ల కాకినాడ‌లో ఉన్న ఆయ‌న బంధువుల ద్వారా బాలకృష్ణకు సంబంధం చూశాడు. బాలకృష్ణకు పెళ్లి చూపుల లో వసుంధర నచ్చడంతో ఓకే చెప్పేశాడు.

బాలకృష్ణ, వసుంధర ల వివాహం 1982 లో జరిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే వసుంధర, బాలకృష్ణు ను పెళ్లి చేసుకుంది. మరి వ‌సుంధ‌ర ఎవ‌రో కాదు శ్రీరామ‌దాసు మోటార్ ట్రాన్స్‌పోర్ట్స్ అధినేత దేవ‌ర‌ప‌ల్లి సూర్యారావు కుమార్తె. బాలకృష్ణ, వసుంధర దంపతులకు కుమారుడు మోక్షజ్ఞ తో పాటు బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని కుమార్తెలు కూడా ఉన్నారు. అలాగే బాలకృష్ణ పెద్దల్లుడు చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌. ఇక బాలకృష్ణ చిన్న అల్లుడు మొతుకుమిల్లి శ్రీభ‌ర‌త్ ఎవ‌రో కాదు కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబ‌శివ‌రావు కూతురు కుమారుడు.. అటు మాజీ ఎంపీ, దివంగ‌త ఎంవీవీఎస్ మూర్తి కొడుకు కుమారుడు. బాలకృష్ణ తో పాటు ఆయన ఇద్దరూ అల్లుళ్లు కూడా రాజకీయాల్లోనే వున్నారు. ఇక బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు.