రంగారెడ్డి: ఓ బాలిక అదృశ్యం

బాలిక అదృశ్యమైన ఘటన దోమ పీస్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాలు.. మోత్కుర్ గ్రామానికి చెందిన చెన్నకేశవులు కుమారై(17) ఈ నెల 12వ తేదీ నుంచి కనిపించకుండా వెళ్లిపోయింది. తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు బంధువుల దగ్గర వెతికినా ఆచూకీ లభించలేదు. తన కుతురు అదృశ్యానికి నరేష్ అనే వ్యక్తి కారణమై ఉంటారని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.